: ఫిబ్రవరి 4న జీవోఎం సమావేశం
ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటలకు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో తదుపరి జీవోఎం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ బిల్లుపై మంత్రుల బృందం చర్చించనుంది. ముఖ్యంగా ఆరు ప్రధాన సవరణ ప్రతిపాదనలను మంత్రుల బృందం పరిశీలించనుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర శాసనసభలో బిల్లుపై చర్చ జరుగుతుండగా మరో మూడు వారాల సమయం కావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.