: పోటీ నుంచి వైదొలగాలని చైతన్యరాజును కోరిన సీఎం


రాజ్యసభ ఎన్నికలకు రాష్ట్రం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన చైతన్యరాజును విరమించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. అయితే, వెనక్కి తగ్గేదిలేదని సీఎంతో ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేవీపీ రామచంద్రరావు చర్చిస్తున్నారు. వారికి ఇస్తున్న మద్దతును వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ముగ్గురి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News