: వ్యవసాయ బడ్జెట్ కు నిరసనగా పయ్యావుల కేశవ్ వాకౌట్
కాంగ్రెస్ సర్కార్ సమర్పిస్తోన్న వ్యవసాయ బడ్జెట్ అంతా ప్రచారం కోసమేనని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రైతు బడ్జెట్ అంటూ సర్కారు మోసం చేసిందని, ఇందుకు నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నట్టు కేశవ్ తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి ఖర్చులు, వ్యయానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు. కొత్తవిషయాలు ఏమీలేని, కాగితాలపై లెక్కల బడ్జెట్ గా పయ్యావుల వ్యవసాయ బడ్జెట్ ను పోల్చారు. కాగా, కన్నా బడ్జెట్ ప్రసంగం చదువుతోన్న ఓ దశలో టీడీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.