: కాంగ్రెస్ తో నేషనల్ కాన్ఫరెన్స్ తెగతెంపులు?
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వస్తామా? లేదా? అని కాంగ్రెస్ సంకట పరిస్థితిలో ఉన్నవేళ, పార్టీకి మరిన్ని చిక్కులొచ్చి పడుతున్నాయి. యూపీఏలో సంకీర్ణమైన జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సీ) పార్టీ హస్తం పార్టీకి కటీఫ్ చెప్పబోతోందని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్-మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో తమ ఏడువందల కొత్త పాలనా విభాగాలను ఏర్పాటు చేయాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రతిపాదించారు. దాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించిందట. దాంతో, రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చి ఏకంగా మద్దతును విరమించుకుని బయటికి రావాలని ఎన్ సీ చూస్తున్నట్లు తెలుస్తోంది.