: తనిష్క్ షోరూం రెండో దొంగ దొరికాడు
హైదరాబాద్ పంజాగుట్టలోని తనిష్క్ బంగారు నగల షోరూంలో భారీ చోరీకి పాల్పడిన నిందితుల్లో రెండో వ్యక్తి ఆనంద్ కూడా పోలీసులకు చిక్కాడు. రెండు రోజులుగా ఆనంద్ కోసం గాలించిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులే సమాచారం అందించారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఆనంద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతనికి సహకరించిన కిరణ్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే.