: అండమాన్ పడవ ప్రమాద మృతులకు పరిహారం ప్రకటించిన ప్రధాని
అండమాన్ నికోబార్ దీవుల్లో పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనపై సానుభూతి వ్యక్తం చేస్తూ, ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఆదివారం అండమాన్ నికోబార్ దీవుల్లో 45 మంది పర్యాటకులను తీసుకువెళ్తూ ఓ పడవ బోల్తాపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 31 మంది మరణించగా 13 మందిని సహాయక దళాలు రక్షించాయి. ఒక వ్యక్తి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. పడవ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.