: వడ్డీలేని పంటరుణాలకు రూ. 500కోట్లు
రైతాంగానికి మరింత చేయూతనిచ్చేందుకు బడ్జెట్ లో ఈ ఏడాది మరిన్ని కేటాయింపులు జరిపారు. ఇందుకుగాను వడ్డీలేని రుణాలకు గాను రూ. 500కోట్లు కేటాయింపులు చేశారు. ఈ మేరకు అదనంగా రాష్ట్ర రైతాంగానికి వడ్డీలేని రుణాలు అందిస్తారు. విత్తనాభివృద్ధికి రూ. 308కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.450కోట్లు, సోలార్ పంపుసెట్లకు రూ.150కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.
రాష్ట్రంలో లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీలేకుండా ఇస్తున్నామని, రూ. లక్ష నుంచి రూ. 3 లక్షలలోపు రుణాలను పావలావడ్డీపై ఇస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇన్ పుట్ సబ్సిడీని 6వేల నుంచి 10వేలకు పెంచుతున్నట్టు చెప్పారు.