: ప్రముఖ అమెరికా ఫోక్ సింగర్ పీట్ సీజర్ మృతి
ప్రముఖ అమెరికా జానపద గాయకుడు పీట్ సీజర్ (94) కన్నుమూశారు. ఆరు రోజుల కిందట న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన గత అర్ధరాత్రి చనిపోయినట్లు ఆయన మనవడు కాహిల్-జాక్సన్ తెలిపారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు తనదైన పాటలు, సంగీతంతో ప్రతి ఒక్కరినీ అలరించిన సీజర్ నుంచి అనేక ఆల్బమ్ లు వచ్చాయి. అమెరికాలోని ప్రతి ఒక్కరు ఆయన అభిమానులే.