: దళితులు, గిరిజనులంటే కాంగ్రెస్, టీడీపీలకు చులకన: వైఎస్సార్సీపీ


దళితులు, గిరిజనులంటే తమకు విపరీతమైన ప్రేమంటూ జబ్బలు చరుచుకునే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు... ఆ వర్గాల వారికి రాజ్యసభ సభ్యత్వం కల్పించాలన్న ఆలోచన మాత్రం రాలేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. హైదరాబాద్ లో వైఎస్సార్సీపీకి చెందిన విశ్వరూప్, బాలరాజు, శ్రీనివాసులు, బాబూరావులు మాట్లాడుతూ కోట్లు ఖర్చుపెట్టేవారికే టికెట్లిస్తారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల ఓట్లు కావాలి కానీ, వారికి పెద్దల సభలో ప్రాతినిధ్యం కల్పించరా? అని నిలదీశారు. సుద్దులు చెప్పే కాంగ్రెస్, టీడీపీల తీరు సిగ్గుచేటని వారు విమర్శించారు.

  • Loading...

More Telugu News