: సీఎం ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు: హరీశ్ రావు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా అయోమయంలో ఉన్నారని... ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి శాసనసభలో ఓటింగ్ అవసరం లేదని ఆయన అన్నారు. రాష్ట్రపతి పంపిన బిల్లులో డ్రాఫ్ట్ బిల్లు అని ఎక్కడా లేదని... ముఖ్యమంత్రే దాన్ని డ్రాఫ్ట్ బిల్లు అంటున్నారని చెప్పారు. రాజ్యాంగం గురించి రాష్ట్రపతికి చెప్పడమంటే... తాతకు దగ్గడం నేర్పడమేనని విమర్శించారు. ఈ రోజు శాసనసభ వాయిదా పడిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.