: ప్రతినెలా 3వేల కేజీల బంగారం అక్రమ రవాణా!


ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉపయోగిస్తున్న భారత్.. అంతే స్థాయిలో దిగుమతి చేసుకుంటోంది. ధర పెరిగినా భారతీయులు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఎల్లో మెటల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇదే సమయంలో దొంగతనాలు, అక్రమ రవాణా అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) 'అంతర్జాతీయ కస్టమ్స్ డే' సందర్భంగా ఢిల్లీలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చిదంబరం, ప్రస్తుత ఆర్థిక లోటు ఆధారంగా.. ప్రతినెలా మూడువేల కేజీల వరకు బంగారం అక్రమంగా రవాణా అవుతోందని అంచనా వేసినట్లు చెప్పారు. అయితే, దేశంలో బంగారాన్ని అధికంగా దిగుమతి చేసుకునే క్రమంలో తొలగిన అడ్డంకుల క్రమంలో రవాణా మరింత ప్రబలమవుతోందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10శాతం పెంచింది. దాంతో, ఈ ఏడాది బంగారం దిగుమతులు తగ్గుతాయని అనుకుంటోంది.

  • Loading...

More Telugu News