: నిందితులను ఇంకెన్ని రోజులు జైళ్లలో ఉంచుతారు?: సీబీఐని ప్రశ్నించిన సుప్రీం


ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఎంసీ కేసు దర్యాప్తుకు మరో నాలుగు నెలల గడువు కావాలని సీబీఐ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరడంపై తీవ్రంగా స్పందించింది. నిందితులను ఇంకా ఎంతకాలం జైలులో ఉంచుతారని సుప్రీంకోర్టు సీబీఐని ప్రశ్నించింది. మరో రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. 27 నెలలుగా గాలి జనార్థనరెడ్డి జైలులో ఉన్న సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News