: స్వతంత్ర అభ్యర్థులుగా రాజ్యసభ ఎన్నికల బరిలో ఇద్దరు ప్రముఖులు
కాంగ్రెస్ రెబల్ నేతగా మారిన జేసీ దివాకర్ రెడ్డి, మరో నేత చైతన్యరాజు రాష్ట్రం నుంచి రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం, ఇతర నేతలు వీరిని వ్యతిరేకిస్తున్నప్పటికీ పోటీచేసి తీరుతామని అంటున్నారు. అటు ఇప్పటికే తనకు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చైతన్య రాజు అంటుంటే... తనకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని జేసీ ధీమాగా ఉన్నారు.