: అధిష్ఠానం ఆదేశిస్తే, ఎక్కడినుంచైనా పోటీ చేస్తా: కృష్ణంరాజు
ఇటీవలే తిరిగి బీజేపీలో చేరిన నటుడు కృష్ణంరాజు రానున్న లోక్ సభ ఎన్నికలపై కన్నేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.