: ఇకపై మా పోరాటం ఢిల్లీలోనే!: అశోక్ బాబు
శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించినా, ఓడించినా పార్లమెంటుకు వెళ్లే అవకాశం ఉందని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును ఓడించాలని అన్ని జాతీయ పార్టీలను కలుస్తామని అన్నారు. ఫిబ్రవరిలో ఛలో పార్లమెంటు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 11, 12, 13 తేదీలలో ఢిల్లీలో నిరసనలు తెలపాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుతానికి బిల్లుపై సంక్లిష్టత ఏర్పడిందని అన్నారు. ఫిబవరిలో అన్ని ఉద్యోగ సంఘాలతో కలసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నామని అశోక్ బాబు వెల్లడించారు. ఇకపై తమ పోరాటం ఢిల్లీలో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.