: చంద్రబాబు నివాసానికి చేరుకున్న హరికృష్ణ
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నందమూరి హరికృష్ణ చేరుకున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం మరి కాసేపట్లో చంద్రబాబు నివాసంలో ప్రారంభం కానుండడంతో హరికృష్ణ చేరుకున్నారు. బిల్లుపై శాసనసభలో తన అభిప్రాయం చెప్పకుండానే తీర్మానం పేరిట కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరతీసిన నేపథ్యంలో పోలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.