: ఆట తుపాకీని చూపి.. బ్యాంకునే బురిడీ కొట్టించిన కుర్రాడు


దక్షిణ జర్మనీలోని బవారియన్ పట్టణంలో గత వారం 16 ఏళ్ల నూనూగు మీసాల కుర్రాడు బ్యాంకులోకి వెళ్ళాడు. నగదు డ్రా చేసుకునేందుకో, దాచుకునేందుకు మాత్రం కాదు.. డబ్బులు దోచుకునేందుకు! ఆడుకునే తుపాకీ చూపించి బెదిరించడంతో బ్యాంకు సిబ్బంది బెంబేలెత్తిపోయి అతనికి డబ్బులిచ్చేశారు. నిందితుడు బైక్ మీద దర్జాగా దేశ సరిహద్దు వరకు వెళ్ళగలిగాడు. సరిహద్దు వద్ద పోలీసులు అప్రమత్తమై నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో బ్యాంకు దోపిడీకి పాల్పడినట్టు అతను అంగీకరించాడు.

  • Loading...

More Telugu News