: సీఎంపై గవర్నర్ కు డీఎస్ ఫిర్యాదు
పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజాప్రతినిధుల విశ్వాసం కోల్పోయారని ఆయన గవర్నర్ కు తెలిపారు. కాగా సాయంత్రం తెలంగాణ మంత్రులు గవర్నర్ ను కలిసి సీఎంపై తమ అభ్యంతరాలను తెలపనున్నారు.