: గ్రామీ అవార్డుల కార్యక్రమంలో మెరిసిన ఏఆర్ రెహమాన్
గ్రామీ-2014 అవార్డుల కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. నిన్న లాస్ ఏంజెలెస్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వేదికపై రెహమాన్ చిత్రాన్ని కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో జయహో గీతానికి గాను రెహమాన్ ను గతంలో రెండు గ్రామీ అవార్డులు వరించిన విషయం తెలిసిందే.