: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే టీబిల్లు: జైరాం రమేష్


కేంద్ర మంత్రి, టీబిల్లుపై ఏర్పాటైన జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ విభజన బిల్లుపై స్పందించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే టీబిల్లును ప్రవేశపెడతామని... అయితే, బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందో? లేదో? చెప్పలేనని అన్నారు. ఆర్టికల్-3 పై సుప్రీం కోర్టు ఇప్పటికే మూడు తీర్పులిచ్చిందని వెల్లడించారు. బిల్లుపై మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిపారు. సీఎం కిరణ్ అభిప్రాయాలపై మాట్లాడటానికి... తాను న్యాయ నిపుణుడిని కాదని చెప్పారు. టీబిల్లుపై న్యాయ సలహాలు కూడా తీసుకున్నామని... కేంద్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. బిల్లు, ముసాయిదా బిల్లు రెండూ ఒకటేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలో కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని అన్నారు. త్వరలోనే మరోసారి జీవోఎం సభ్యులందరం సమావేశమవుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News