: వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ.. గంట వాయిదా
వాయిదా అనంతరం శాసనసభ పున:ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సభను సజావుగా కొనసాగించడానికి సహకరించాలని, మంత్రులంగా తమ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ పదేపదే కోరారు. అయినా ఎవరూ వినకపోవడంతో, స్పీకర్ నాదెండ్ల సభను మరో గంట పాటు వాయిదా వేశారు.