: కన్నడ సినీ పరిశ్రమ బంద్


డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా ఈ రోజు కన్నడ సినీ పరిశ్రమ బంద్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇతర భాషా చిత్రాలు కన్నడలోకి డబ్ అవుతుండటంతో... కన్నడ సినీ పరిశ్రమ మనుగడ కష్టంగా మారుతోందంటూ బంద్ చేపట్టారు. కన్నడ పరిశ్రమను కాపాడుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటూ నిర్మాత గోవిందు తెలిపారు. కన్నడ పరిశ్రమకు చెందిన నటీనటులంతా బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కలసి రావాలని పిలుపునిచ్చారు. కొంత మంది డబ్బింగ్ చిత్రాల నిర్మాతలు తాము చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ బంద్ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో సినిమాలు ఆడకుండా నిలిపివేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు కన్నడనాట ఎక్కువ జనాదరణను పొందుతున్నాయి. ఈ సినిమాల వల్ల కన్నడ సినిమాలు వెలవెల బోతున్నాయి.

  • Loading...

More Telugu News