: కిరణ్ లేవనెత్తిన రూల్ 77 వర్తించదు: హరీష్ రావు


ముఖ్యమంత్రి కిరణ్ లేవనెత్తిన రూల్ 77... విభజన బిల్లుకు వర్తించదని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్రపతి పంపిన బిల్లుపై తీర్మానాలు చేయడం కుదరదని స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇచ్చిన నోటీసు ఏకపక్షంగా ఉందని... తెలంగాణ ప్రాంత మంత్రులందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న కిరణ్, చంద్రబాబులు ఏకమై టీబిల్లును వెనక్కి తిప్పి పంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రూల్ 77 కింద తీర్మానం చేయాలంటే కనీసం పది రోజుల ముందు నోటీసు ఇవ్వాలని చెప్పారు.

  • Loading...

More Telugu News