: బిల్లును తిప్పి పంపాల్సిందే: ధూళిపాళ్ల
అసమగ్రంగా ఉన్న టీబిల్లును తిప్పి పంపాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నామని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. సరైన రీతిలో లేని బిల్లుపై ఎంత చర్చించినా ఉపయోగం లేదని, దాన్ని తిప్పి పంపాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ ఇచ్చిన నోటీసును సభ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ రోజు ఆయన మాట్లాడారు. బిల్లుపై సభలో ఓటింగ్ పెట్టాల్సిందేనని ఆయన అన్నారు.