: 'తనిష్క్ జువెలర్స్' దొంగ దొరికాడు
తనిష్క్ జువెలర్స్ లో రూ.23 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన దొంగ దొరికాడు. గుంటూరు జిల్లా ఈపూరు గ్రామానికి చెందిన నిందితుడు కిరణ్ కుమార్ సంచలనం కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్టు, దేశ పరిస్థితులే తనను దొంగగా మార్చాయని చెప్పినట్టు సమాచారం. నగరంలోనే అతి పెద్ద చోరీగా నమోదైన ఈ ఘటనపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్న తరుణంలో, దొంగతనం చేసిన కిరణ్ కుమార్ పోలీసులకు తనకు తానే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.