: విభజన సమస్యకు పరిష్కారం బిల్లును తిప్పి పంపడమే: టీజీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును వెనక్కి తిప్పి పంపడమే సరైన పరిష్కారం అని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, విభజన బిల్లు ఇరు ప్రాంతాల ప్రజల్లో ఎవరికీ ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లును కేంద్రం రూపొందించిందని మంత్రి టీజీ విమర్శించారు.