: సభాపతికి నోటీసు ఇచ్చిన సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు
అసమగ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు సభాపతి నాదెండ్లకు నోటీసు ఇచ్చారు. 77వ నిబంధన కింద ముసాయిదా బిల్లును వెనక్కి తిప్పి పంపేలా శాసనసభలో తీర్మానం చేయాలని వారు ఈ నోటీసు ఇచ్చారు. అసమగ్రమైన ఉన్న బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపటాన్ని వారు తప్పుబట్టారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినేలా ఉన్న ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని వారు తేల్చిచెప్పారు.