: అవినీతి పెచ్చుమీరింది.. ఎన్నికల్లో పోటీ చేయను: అళగిరి
డీఎంకేలో అవినీతి పెచ్చుమీరిందని డీఎంకే బహిష్కృత నేత అళగిరి ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని అన్నారు. తనపై ఆరోపణలు వాస్తవం కాదని నిరూపించేందుకు తాను త్వరలోనే మధురై వెళ్లనున్నానని తెలిపారు. తన తండ్రిపై కొంత మంది ప్రభావం పని చేస్తోందని అళగిరి మండిపడ్డారు.