: ఫిలింఫేర్ లో 'భాగ్ మిల్కా భాగ్' కు అవార్డుల పంట


ఫిలింఫేర్ అవార్డుల్లో బాలీవుడ్ చిత్రం 'భాగ్ మిల్కా భాగ్' కు అవార్డుల పంట పండింది. ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (ఫర్హాన్ అక్తర్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరి, ఈ చిత్రానికే ఉత్తమ గీత రచయిత ప్రసూన్ జోషి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్(డోలీ అహ్లువాలియా) విభాగాల్లో భాగ్ మిల్కా భాగ్ అవార్డులు దక్కించుకుంది. ముంబయిలో నిన్న జరిగిన 59 వ వార్షిక ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రయంలో పురస్కారాలను అందజేశారు. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవితం కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. ఫర్హాన్ అక్తర్ మిల్కా పాత్రను పోషించాడు.

  • Loading...

More Telugu News