: బిల్లును ఎందుకింత అసాధారణమైన రీతిలో పంపారో తెలియదు: జేపీ
కేంద్రం రూపొందించగా, రాష్ట్రపతి నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ శాసనసభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకింత అసాధారణమైణ రీతిలో బిల్లు పంపించారో తెలియదన్నారు. హోంశాఖ కార్యదర్శి నుంచి తనకు రెండు లేఖలు వచ్చాయని, అందులో రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖలో బిల్లు అని ఉందని చెప్పారు. బిల్లు రూపొందించక ముందు నిర్ణయం తీసుకునే సమయంలో తెలంగాణ, రాయలసీమ వారిని కూర్చోబెట్టి మాట్లాడినట్లు తనకైతే సమాచారం లేదన్నారు. అయితే, సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత ఒక్క పదం కూడా మారలేదన్నారు.