: పురందేశ్వరి వల్ల పార్టీకి ఏం లాభంలేదు: ఎమ్మెల్యే అవంతి
సీఎం పర్యటన సాక్షిగా విశాఖ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కేంద్రమంత్రి పురందేశ్వరి మీద సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఓ సుధీర్ఘలేఖను ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. పురందేశ్వరి పెద్ద అహంకారని అవంతి ఆరోపించారు. ఆమె వల్ల భీమిలి ప్రాంతానికి ఒరిగిందేమీలేదని విమర్శించారు.
ఈ వ్యవహారం మీద మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ వీరిమధ్య ఏమైనా విభేదాలుంటే కాంగ్రెస్ పెద్దలు పరిష్కరిస్తారని చెప్పారు.