: పాము విషం.. 80 ఏళ్ల తర్వాత కూడా ప్రాణం తీస్తుంది
ఔషధం శక్తి మూడు నుంచి ఐదేళ్లకే కాలం చెల్లిపోతుంది. తేనె కొన్నేళ్లకు తీరు మారిపోతుంది. మనిషి కూడా కాలధర్మంలో భాగమే. కానీ, మనుషుల ప్రాణాలను సులువగా తీసే పాముల విషానికి మాత్రం ప్రాణం ఎక్కువే. అంటే చాలా కాలం తర్వాత కూడా అది ఏ మాత్రం ప్రభావం కోల్పోకుండా ప్రాణాలు తీసే శక్తిని కలిగి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. పాముల విషాన్ని రక్తపోటును నియంత్రించే కేప్టోప్రిల్ ఔషధం, మధుమేహ ఔషధం బైట్టా సహా ఎన్నో ఔషధాల తయారీలో వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో పాము విషం 80 ఏళ్లు నిల్వ చేసిన తర్వాత కూడా జీవపరంగా చురుగ్గా ఉంటున్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ బ్రియాన్ ఫ్రై తెలిపారు.