: డిమాండ్ కు తగ్గ గ్యాస్ ఉత్పత్తి రాష్ట్రంలో లేదు: సీఎం కిరణ్


రాష్ట్ర శాసన సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రంలో 35 వేల కోట్ల రూపాయలు పెట్టినా డిమాండ్ కు తగినంత గ్యాస్ ఉత్పత్తి కావట్లేదని సీఎం చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి గ్యాస్ కొందామన్నా.. అక్కడా లభించడం లేదని ఆయన తెలిపారు. గ్యాస్ కేటాయింపులు చేయమని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రికి ఈ విషయంపై ఘాటుగా లేఖ రాశానని ఆయన సభకు తెలిపారు. ఇక బొగ్గు కేటాయింపులు కూడా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని ఆయన అన్నారు. సింగరేణి బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గులో అత్యధిక భాగం తెలంగాణ ప్రాంతానికే అని సీఎం తెలిపారు.

  • Loading...

More Telugu News