: లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్ కి దేహశుద్ధి
విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడికి స్థానిక మహిళా సంఘాలు దేహశుద్ధి చేశాయి. విశాఖపట్టణం, గోపాలపట్నంలోని కొత్తపాలెం ఎంపీపీ ప్రాధమిక పాఠశాలలో సింహాచలం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినిని సింహాచలం లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల వారు నిందితుడి ఇంటికి వెళ్లి బడితె పూజ చేశారు. దేహశుద్ధి చేసిన అనంతరం నిందితుడిని 5వ పట్టణ పోలీసులకు అప్పగించారు.