: కేంద్రంలో అధికారం ఎన్డీయేదే: ఐబీఎన్ పోల్ ట్రాకర్ సర్వే


మోడీ సారధ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీఎన్ఎన్ ఐబీఎన్, లోక్ నీతి పోల్ ట్రాకర్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే ఒక్క బీజేపీకే 190 నుంచి నుంచి 200 వరకు స్థానాలు వస్తాయని సర్వే వెల్లడించింది. బీజేపీ దాని మిత్ర పక్షాలతో కూడిన ఎన్డీయేకు 211 నుంచి 231 స్థానాలు లభిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఎన్డీయేలో శివసేన, శిరోమణీ అకాళీదళ్ మాత్రమే ఉన్నాయి. పట్టణాలు, పల్లెల్లోనూ బీజేపీ గాలి వీస్తుందని.. ధనిక, ఉన్నత, మధ్య, పేద వారిలోనూ బీజేపీకి ఆదరణ పెరుగుతోందని సర్వే తెలిపింది.

ఇక, కాంగ్రెస్ కు 90 నుంచి 100లోపు స్థానాలే వస్తాయి. యూపీఏకి మొత్తం కలిపినా 110 స్థానాలకే పరిమితం అవుతుంది. ప్రాంతీయ పార్టీలను చూస్తే.. తృణమూల్ కాంగ్రెస్ 20 నుంచి 28 స్థానాలతో పెద్ద ప్రాంతీయ పార్టీగా నిలవనుంది. ఏఐడీఎంకేకు 15 నుంచి 23, వామపక్షాలకు 23 వరకు లభించనున్నాయి. బీజేడీ 10 నుంచి 16.. బీఎస్పీ10 నుంచి 16.. ఎస్పీ 8 నుంచి 14.. జేడీయూ 7 నుంచి 13... డీఎంకే 7 నుంచి 13.. ఆమ్ ఆద్మీ 6 నుంచి 12 స్థానాలను సొంతం చేసుకుంటాయి. రాష్ట్రానికి వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 నుంచి 19 స్థానాలు, టీడీపీకి 9 నుంచి 15.. టీఆర్ఎస్ కు 4 నుంచి 8 స్థానాలు లభిస్తాయి.

  • Loading...

More Telugu News