: అక్కినేని వ్యక్తి కాదు... మహా సంస్థ: నిర్మాత ఆదిశేషగిరిరావు
దివంగత అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తి కాదు, మహా సంస్థ అని నిర్మాత ఆదిశేషగిరిరావు అన్నారు. తెలుగు ప్రజలు ఉన్నంతకాలం అక్కినేని చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో అక్కినేని సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపాదించిన ఆస్తిలో ఎక్కువ శాతం సినిమా పరిశ్రమ అభివృద్ధికే అక్కినేని ఖర్చు చేశారని గుర్తు చేసుకున్నారు.