: షార్జాలో 'బంగారు' బాబు దొరికిపోయాడు
సూట్ కేసుకు బంగారపు హ్యాండిల్ బిగించి షార్జా నుంచి దర్జాగా బయల్దేరిన ఆ భారతీయుడు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. తనిఖీల్లో ఈ విషయం బయటపడటంతో అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని గల్ఫ్ న్యూస్ తెలిపింది. షార్జా విమానాశ్రయంలో ఇటీవల బంగారం అక్రమ రవాణా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కస్టమ్స్ సుంకం ఎగవేసేందుకు బంగారం అక్రమ రవాణాకు సిద్దపడుతున్నారు. కఠిన చర్యలు తప్పవని కస్టమ్స్ అధికారులు హెచ్చరిస్తున్నా 'బంగారు' బాబులు పట్టించుకోవటం లేదు.