: చేప తింటే మతిమరుపు మాయం..!
చేపలను ఎక్కువగా తింటే.. మెదడు పరిమాణం పెరుగుతున్నట్టు, అల్జీమర్స్ వంటి జబ్బులు రాకుండా కాపాడుతున్నట్టు సౌత్ డకోటా వర్శిటీ పరిశోధనలో తేలింది. చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వుంటాయి. మిగతా వారితో పోలిస్తే.. ఈ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల స్థాయులు ఎక్కువగా వున్న వృద్ధుల్లో మెదడు కాస్త పెద్దదిగా వున్నట్లు గుర్తించారు. జ్ఞాపక శక్తిలో పాలు పంచుకునే హిప్పోక్యాంపన్ పరిమాణం కూడా వీరిలో 2.7% ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. అల్జీమర్స్ జబ్బులో దాని లక్షణాలు కనిపించడానికి ముందే హిప్పోక్యాంపన్ భాగం క్షీణిస్తుంది. చేపలను తినటం ద్వారా ఈ కొవ్వు ఆమ్లాల మోతాదులను పెంచుకోవచ్చని పరిశోధకుడు జేమ్స్ వి.పోటాల తెలిపారు. అంతేకాక, చేపలను తింటే మతిమరుపు కూడా మాయమవుతుందని చెప్పారు.