: బస్తర్ దాడిపై ఉసెండి నుంచి కీలక సమాచారం


ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నేత గుడ్సా ఉసెండి నుంచి, ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో జరిగిన దారుణ మారణకాండపై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. గతేడాది మే 25న పరివర్తన్ ర్యాలీలో పాల్గొని వస్తున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతల కాన్వాయ్ పై దాడికి తెగబడిన మావోయిస్టులు మందుపాతర పేల్చి, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తనతో పాటు దర్బా డివిజనల్ కమిటీ అధ్యక్షుడు సురేందర్, ఉపాధ్యక్షుడు జలీల్ లు నేతృత్వం వహించినట్టు తెలిపారు. ఈ దాడిలో సుమారు 200కు పైగా మావోయిస్టులు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. ఉసెండిని తమకు అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు ఆంధ్రప్రదేశ్ పోలీసులను కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News