: ఇంటర్నెట్ లో లిప్తపాటులో 1.4 టెరా బైట్ల వేగం..!
ఇంటర్నెట్ రంగంలో పరిశోధకులు సరికొత్త రికార్డును నెలకొల్పారు. బ్రాడ్ బ్యాండ్ లో సెకనుకు 1.4 టెరా బైట్ల వేగాన్ని సాధించారు. ఈ వేగంతో.. 44 హై డెఫినేషన్ సినిమాలను లిప్తపాటులో ప్రసారం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఫ్రెంచ్ నెట్ వర్కింగ్ ఎక్విప్ మెంట్ కంపెనీ 'అల్కాటెల్ - ల్యుసెంట్'తో కలిసి బ్రాడ్ బ్యాండ్ లో ఈ వేగాన్ని సాధించారు. లండన్ లోని ఫైబర్ నెట్ వర్క్ లో వారు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీని కోసం ఎలాంటి అదనపు పరికరాలు అవసరం లేదని వారు తెలిపారు. మామూలు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ తో సమాచారాన్ని ప్రసారం చేయవచ్చు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇది నిజంగా శుభవార్తే మరి.