: పాతికేళ్ల లోపు పురుషులు పెళ్లి చేసుకుంటే.. వెన్నెముక వీకే!
పీజీ కాగానే, మంచి ఉద్యోగం చూసుకుని.. పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నారా? అయితే.. ఇది మీరు చదివి తీరాల్సిందే! మగవారు పాతికేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎముకల దృఢత్వం దెబ్బ తింటుందని ఒక పరిశోధనలో వెల్లడైంది. 25 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న వారిలో ఎముకలలో పటుత్వం క్రమంగా తగ్గిపోతోందని ఈ పరిశోధనలో గుర్తించారు. కాలిఫోర్నియా విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు పలు ఆసక్తికర విషయాలను కనుగొన్నారు.
తక్కువ వయసులో వివాహం చేసుకోవటం వల్ల.. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోకముందే అదనపు భారాన్ని తలకెత్తుకోవటమేనని, దీంతో సదరు పురుషులపై తీవ్రమైన వత్తిడి వల్ల ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతుండవచ్చు అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన అరుణ్ కర్ణ మంగళ తెలిపారు. అలాగే, ఇద్దరి కంటే ఎక్కువ మంది మగువలతో సంబంధాలున్న వారితో పోలిస్తే.. ఒక్కరితోనే కలకాలం కాపురం చేసే మగవాళ్ళలో ఎముకలు గట్టిగా ఉంటాయని ఈ పరిశోధనల్లో తేల్చారు. పెళ్లి చేసుకోని బ్రహ్మచారుల కంటే కూడా వీరి ఎముకల పటుత్వం ఎక్కవేనట. మహిళల విషయానికొస్తే.. భర్త అన్ని పనుల్లో సహకరించే వాడు ఐతే.. సదరు స్త్రీల ఎముకల పటుత్వం ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు తెలిపారు.