: త్వరలో రోమింగ్ ఫ్రీ.. బీఎస్ఎన్ఎల్ యోచన
దేశంలో ఎక్కడికెళ్లినా.. రోమింగ్ రూపంలో చేతి చమురు వదిలించుకోనక్కర్లేదు. కాల్ చేసిన వారు, పుచ్చుకున్నవారి నుంచి రెండు వైపులా పిండుకునే రోమింగ్ భారం తగ్గనుంది. ప్రభుత్వరంగంలోని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉచిత రోమింగ్ పథకాలను ఈ నెల 26 నుంచి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రోజుకో రూపాయి చెల్లించడం ద్వారా రోజంతా ఉచితంగానే రోమింగ్ కాల్స్ అందుకునే ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ తీసుకురానుంది. దీంతో రోమింగ్ యుద్ధం మొదలవుతున్నట్లే. ప్రైవేటు ఆపరేటర్లు కూడా ఇలాంటి ప్లానులతో ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి.