: పాశ్చాత్యుల కండ కావరం మరోసారి.. ప్యాంటులపై గణేశుడి చిత్రాలు
హిందూ దేవతలను కించపరచడం పాశ్చాత్యులకు ఫ్యాషనైపోయింది. సర్వమత సామరస్యంతో ముందుకు వెళ్లాల్సిన రోజుల్లోనూ అమెరికన్లు పరమత విద్వేషాన్ని చాటుకుంటున్నారు. తాజాగా అమెజాన్ డాట్ కామ్ సైట్లో ప్యాంటులపై గణేశుడి చిత్రాలు దర్శనమిచ్చాయి. ఎక్కడపడితే అక్కడ అగౌరవంగా స్వామి చిత్రాలతో రూపొందించిన ప్యాంటులను అమెజాన్ విక్రయానికి పెట్టింది. దీనిపై నెవెడాకు చెందిన రాజన్ జేద్ అమెజాన్ కు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. అన్ని విఘ్నాలను తొలగించే దేవుడిగా గణేశుడిని హిందువులు ఆరాధిస్తారని.. స్వామి చిత్రాలు ప్యాంటుల వెనుక భాగంలో, కాలి భాగాల్లో ముద్రించడం ఆ మతస్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. దీంతో అమెజాన్ జరిగిన తప్పును గ్రహించి ఆ ప్యాంటులను తొలగించింది. హిందువుల ఆందోళలను అర్థం చేసుకున్నామని తెలిపింది. కానీ, క్షమించండని మాత్రం కోరలేదు.