: చెత్త పాస్ వర్డులు ఇవే...!
అత్యంత పరమ చెత్త పాస్ వర్డ్ ఏదో మీకు తెలుసా? 2013లో ఎక్కువగా చోరీకి గురైన పాస్ వర్డ్ గురించి తెలుసా? అదే.. 123456. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వారు పెట్టుకునే పాస్ వర్డ్ లు ఇలానే ఉంటాయి. దీంతో చోర రాయుళ్లకు కలిసివస్తోంది. స్ప్లాష్ డాటా 2013 ఏడాదికి సంబంధించి ఎక్కువ మంది ఉపయోగించే 25 చెత్త పాస్ వర్డులను ప్రకటించింది. qwerty, abc123, 111111, iloveyou, 123456, 12345678, adobe123,123123, admin, 123456789, letmein, photoshop, 123, monkey, shadow, sunshine, password1, princess, azerty, trustno1, 000000.