: ఢిల్లీ రాలేను.. దిగ్విజయ్ కు తేల్చి చెప్పిన సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ తన ఢిల్లీ టూర్ ను రద్దు చేసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలు, టీబిల్లుపై చర్చ తదితర అంశాలపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కిరణ్ ఢిల్లీ వస్తున్నారని నిన్న దిగ్విజయ్ సింగ్ కూడా ప్రకటించారు. అయితే, శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ కొనసాగుతున్నందున... తాను ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీకి రాలేనని డిగ్గీరాజాకు కిరణ్ తెలిపారు. పీసీసీ చీఫ్ బొత్స మాత్రం షెడ్యూలు ప్రకారం ఈ మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.