: పేలుళ్ల బాధిత కుటుంబానికి 6లక్షల సాయం
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన రవికుమార్ కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు 6లక్షల రూపాయల సాయాన్ని చెక్ రూపంలో అందించారు. కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం బేగంపేటలో రవి కుటుంబ సభ్యులను కలిసి మంత్రి ఈ సాయాన్ని అందించారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు.