: బీడబ్య్లూఎఫ్ ర్యాంకింగ్స్ లో 9వ స్థానానికి చేరిన సైనా
బ్యాడ్మింటన్ ప్రపంచ ఫెడరేషన్ (బీడబ్య్లుఎఫ్) ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ర్యాంకు మరింత దిగజారింది. బీడబ్య్లుఎఫ్ వెల్లడించిన తాజా ర్యాంకుల ప్రకారం.. సైనా తొమ్మిదవ స్థానంలోకి పడిపోయింది. అదే గతేడాది సైనా ఏడవ స్థానంలో ఉంది. గతవారం మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ లో ఓటమి పాలవడంతో... దాని ప్రభావం ఆమె ర్యాంకు మీద పడింది. అంతేకాక గతేడాది సైనా ఎలాంటి టైటిల్ గెలుచుకోకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. ఇక పీవీ సింధు తన 11వ ర్యాంకును నిలబెట్టుకుంది.