: చిదంబరానికి అది తగదు: వెంకయ్యనాయుడు


అంతర్జాతీయ వేదికలపై నుంచి బీజేపీని విమర్శించడం కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి తగదని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, దేశంలో రాజకీయ వ్యాఖ్యానాలు చేయొచ్చు కానీ, దావోస్ లాంటి అంతర్జాతీయ వేదికలపై దేశరాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం ఆయన చౌకబారుతనానికి నిదర్శనమని అన్నారు. యూపీఏది ప్రజల రక్తం పీల్చే ఆర్థిక విధానమని ఆయన మండిపడ్డారు. ఆయన ఆర్థిక విధానాలతో దేశంలో వృద్ధి రేటు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శించారు. శాసనసభలో సమయం వృధా చేయకుండా బిల్లుపై సమగ్రంగా చర్చించాలని ఆయన సూచించారు. గతంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News