: వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్


శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0 స్కోరు తేడాతో మహిళల క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. గురువారం విశాఖలో జరిగిన చివరి వన్డేలో లంకను 95 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలి రాజ్ అద్భుత బ్యాటింగ్ తో సెంచరీ (104) సాధించింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 44 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. పూనమ్ యాదవ్ 4, రానా 2, గయాక్వాద్ 2 వికెట్లు, గోస్వామి ఒక వికెట్ తీసింది.

  • Loading...

More Telugu News