: 60 నెలల సమయమివ్వండి... సామాన్యుల జీవితాలు మారుస్తా: మోడీ
తనకు 60 నెలల సమయం ఇస్తే సామాన్య ప్రజల జీవితాలు మారుస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ దేశంలో పేదరికం పెరిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థికవృద్ధి తగ్గిపోయి ద్రవ్యోల్బణం పెరిగిందని మోడీ విమర్శించారు.